Header Banner

లిక్కర్ స్కాం - వైసీపీకి బిగ్ షాక్.. జగన్‌ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ! మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా..

  Mon May 05, 2025 15:20        Politics

ఏపీ లిక్కర్ స్కామ్‌లో (AP Liquor Scam) జగన్‌ బ్యాచ్‌కు సుప్రీం కోర్టు (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని చెబుతూ.. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కె.ధనంజయ రెడ్డి, పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్స్‌పైన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (సోమవారం) విచారణ జరిపింది. అయితే ఏపీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి మధ్యంతర ఉపశమనం కలిగించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి: దారుణం.. భార్య వల్ల ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి.. ఇంట్లోనే కుళ్లిపోయిన మృతదేహాలు!

 

ఎల్లుండి ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున తాము వెంటనే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఎలా సాగింది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలియజేయాలని.. ఆ తరువాత ఈనెల 8న దీనిపై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు అయినా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనమైనా కలిగించాలంటూ ముగ్గురు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. కానీ అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 7 వరకు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ధర్మాసనం. అరెస్ట్ చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి, అధికారాల ప్రకారం కావాలంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చని.. ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ పార్థివాలా ఈ సందర్భంగా తెలిపారు. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్‌పై తాము ఎలాంటి కామెంట్ చేయడం లేదని.. నిర్ణయాధికారం హైకోర్టుదే అని సుప్రీం కోర్టు వెల్లడించింది. హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే సుప్రీం కోర్టులో దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #YCPOffice #Notes #APNews #APpolitics